ఫన్, డెలీషియస్ “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” ప్రీమియర్ కు రెడీ

ఫన్ డెలిషియస్ వంటలను అందించేందుకు రెడీ అవుతోంది “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K”. ఆహా ఓటీటీలో మార్చి 6వ తేదీ నుంచి ఈ ప్రోగ్రాం ప్రీమియర్ కానుంది. సెలబ్రిటీ హోస్ట్ సుమతో పాటు యాక్టర్ జీవన్ కుమార్ “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చనున్నారు. చెఫ్ మంత్ర సీజన్ 1 సక్సెస్ ను కొనసాగించబోతోంది ఈ సీజన్ 2. ప్రభాస్ ప్రాజెక్ట్ కె అంటే కల్కి అని తెలుసు. మరి ఈ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె ఎంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అమర్ దీప్-అర్జున్, దీపికా రంగరాజు-సమీరా భరద్వాజ్, సుప్రిత-యాదమ్మ రాజు, ప్రషు-ధరణి మరియు విష్ణుప్రియా-పృథ్వీ జోడీ రుచికరమైన వంటకాలు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. మన వంటలతో పాటు సరికొత్త వంటకాలను ప్రతి ఎపిసోడ్ లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె పరిచయం చేయబోతోంది.