హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతోంది. కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు తమ జీవితంలోకి చిన్నారి అతిథిని ఆహ్వానించనున్నారు. తాము పేరెంట్స్ కాబోతున్నాం అనే విషయాన్ని ఈరోజు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
బేబీ సాక్స్ తమ చేతుల్లోకి తీసుకున్న ఫొటో షేర్ చేశారు. ఈ పోస్ట్ కు కియారా, సిద్ధార్థ్ స్నేహితులతో పాటు నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతూ విశెస్ పంపుతున్నారు. కలిసి సినిమాల్లో నటించిన కియారా, సిద్ధార్థ్ ప్రేమించుకుని, 2023లో పెళ్లి చేసుకున్నారు. కియారా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది.