జపాన్ రిలీజ్ కు “దేవర” రెడీ

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా జపాన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా మార్చి 28న జపాన్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. దేవర జపాన్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఇప్పటికే అక్కడి మీడియాతో వీడియో కాల్ లో ఇంటరాక్ట్ కాగా..ఇప్పుడు దేవర జపనీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు, జపనీస్ కలిసిన డైలాగ్స్ తో దేవర జపనీస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో దేవర జపనీస్ ట్రైలర్ సందడి చేస్తోంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న నేపథ్యంలో దేవర జపనీస్ ట్రైలర్ లో ఎన్టీఆర్ ను ఆర్ఆర్ఆర్ హీరో అని పరిచయం చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించిన దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం దేవర 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.