యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “తల్వార్” నుంచి ఈ రోజు మహా శివరాత్రి పండుగ సందర్బంగా పవర్ ఫుల్ ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆకాష్ చెప్పిన వాయిస్ ఓవర్ తో ఈ ఆడియో గ్లింప్స్ సినిమా మీద ది బెస్ట్ ఇంప్రెషన్ కలిగించింది. యుద్ధాలు జరిగే తీరు మారినా చివరి ఫలితం రక్తపాతమే అవుతోందనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అధర్మం మీద కట్టిన కోటల్ని బద్దలు కొట్టేందుకు వస్తున్నా అనే డైలాగ్ “తల్వార్” ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
“తల్వార్” ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పూరి జగన్నాథ్, ప్రకాష్ రాజ్, షిన్ టామ్ చాకో, అనసూయ భరద్వాజ్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “తల్వార్” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.