మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న క్యారెక్టర్ లుక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం, అభినవ్ గోమటం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుబ్బు క్యారెక్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నటుడు జీవన్ కుమార్ చేసిన ప్రాజెక్ట్ మేనేజర్ విజ్ఞాన్ కుమార్ క్యారెక్టర్ లుక్ ను రివీల్ చేశారు. విగ్ తో కనిపిస్తున్న ఈ విజ్ఞాన్ కుమార్ ఇంగ్లీష్ రాకుండానే ప్రాజెక్ట్ మేనేజర్ గా ఎలా మేనేజ్ చేశాడు అనేది ఎంటర్ టైనింగ్ గా ఉండబోతోంది.
“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్నారు. రైటర్ షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.