‘వీరమల్లు’ – షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీరమల్లు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు సాంగ్స్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. మాట వినాలి, కొల్లగొట్టినాదిరో పాటలు రిలీజయ్యాయి. హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ కొత్త సందేహాలు వెల్లడిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందట. పవన్ ఇప్పుడున్న బిజీలో మళ్లీ డేట్స్ ఇవ్వాల్సిఉంటుంది. ఆ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ జరిపి మార్చి 28న రిలీజ్ చేయడం సాధ్యమేనా అనేది పవర్ స్టార్ ఫ్యాన్స్ డౌట్. టీమ్ మాత్రం కాన్ఫిడెంట్ గా మ్యూజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. మరోవైపు నితిన్ రాబిన్ హుడ్ సినిమా కూడా ఇదే తేదీకి రిలీజ్ కు రెడీ అవుతోంది.