నాగార్జున నా సామి రంగ తర్వాత కుబేర, కూలీ అంటూ కీలక పాత్రల్లో సినిమాలు చేస్తున్నాడు కానీ సోలో హీరోగా నటించే సినిమాను మాత్రం ప్రకటించలేదు. నాగార్జున కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఇదొక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో చేయాలి అనుకుంటున్నారు నాగార్జున. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇందులో నాగార్జునతో కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది
ప్రస్తుతం నాగార్జున కూలీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే కూలీ షూటింగ్ పూర్తి కానుంది. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర మూవీలో నటిస్తున్నారు నాగార్జున. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ కీలకంగా ఉండనుంది. ప్రస్తుతం తను కమిట్ అయిన మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ పై నాగార్జున నిర్ణయం తీసుకోనున్నారు.