ప్రియాంక జవాల్కర్ ఇలా ఫిక్స్ అవ్వాల్సిందేనా

నిన్న రిలీజైన మ్యాడ్ స్క్వేర్ టీజర్ లో కొన్ని సెకన్ల పాటు మెరిసింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. పాటలో ప్రియాంక కనిపించడం ఆమె నడుము మీద లైలా పచ్చబొట్టు ఉండటం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియాంక జవాల్కర్ మ్యాడ్ స్క్వేర్ లో ఓ స్పెషల్ సాంగ్ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో టిల్లు స్క్వేర్ లోనూ ప్రియాంక పబ్ సీన్ లో చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఎస్ఆర్ కల్యాణమండపం, టాక్సీవాలా వంటి సూపర్ హిట్స్ కొట్టిన తెలుగు అమ్మాయి ఇలా స్పెషల్ సాంగ్స్ కు, గెస్ట్ రోల్స్ కు ఫిక్సయ్యేలా కనిపిస్తోంది. ఇంకొన్ని మంచి మూవీస్ దక్కితే హీరోయిన్స్ కరువు ఉన్న టాలీవుడ్ లో ప్రియాంక మంచి ఆప్షన్ అయ్యేది.

మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చి 29న థియేటర్స్ లోకి రాబోతోంది.