హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా” మార్చి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన అగ్గిపుల్లె, హే జింగిలీ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ ‘కన్నా నీ..’ ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు.ఎమోషనల్ లవ్ సాంగ్ గా ఈ పాట ఉండబోతోంది. ‘కన్నా నీ..’ సాంగ్ గురించి హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ప్రమోషనల్ ఈవెంట్స్ లో స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు.
“దిల్ రూబా” సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న “దిల్ రూబా” థియేటర్స్ లో సందడి చేయనుంది.