ఇదేం నెగిటివ్ ప్రమోషన్ నాని

ఏ సినిమా టీజర్ కైనా హయ్యెస్ట్ వ్యూస్ వస్తే మా సినిమాకు ఇన్ని వ్యూస్ వచ్చాయని ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు కానీ మరో హీరో సినిమా టీజర్ తో పోల్చుతూ ఆ సినిమా కంటే మా మూవీ టీజర్ కు ఎక్కువ వ్యూస్ వచ్చాయని ప్రచారం చేసుకోవడం నెగిటివ్ పబ్లిసిటీనే అవుతుంది. నాని హిట్ 3 సినిమా టీజర్ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్ కంటే ఎక్కువ వ్యూస్ తెచ్చుకుందని, విజయ్ సినిమాను నాని సినిమా డామినేట్ చేస్తోందంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారం చూస్తే ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీనే చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్క టీజర్ తోనే సినిమా రేంజ్ ను, అది సాధించబోయే ఫలితాన్ని ఎలా అంచనా వేయగలరు. ఫ్రెండ్ అని చెప్పుకునే హీరో విజయ్ సినిమా మీద జరుగుతున్న ఈ ప్రచారం నానికి తెలియకుండానే చేస్తున్నారని అనుకోలేం. నానితో జెర్సీ లాంటి మెమొరబుల్ మూవీ చేసిన దర్శకుడే విజయ్ తో కింగ్ డమ్ రూపొందిస్తున్నాడు. మన టాలీవుడ్ హీరోల మధ్య ఉండే హెల్దీ కాంపిటేషన్ కు ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీలు బ్యాడ్ చేస్తాయి.