యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో “మ్యాడ్ స్క్వేర్” టీజర్

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ కు ఒక ఊపు తీసుకొచ్చిన సినిమా మ్యాడ్. 2023లో రిలీజై మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చి 29న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

మ్యాడ్ స్క్వేర్ టీజర్ ఎలా ఉందో చూస్తే – లడ్డూ(విష్ణు ఓఐ) పెళ్లికి వెళ్తారు నార్నే నితిన్, రామ్ నితిన్, సంతోష్ శోభన్. తన ఫ్రెండ్స్ పెళ్లిలో ఏం చేస్తారో అని లడ్డూ భయపడినట్లే అవుతుంది. లడ్డూ పెళ్లిలో ఈ ముగ్గురు స్నేహితులు రచ్చ చేస్తారు. బ్యాచ్ లర్ పార్టీ కోసం గోవా ట్రిప్ కు వెళ్తార. అక్కడ ఓ ఇష్యూలో ఇరుక్కుంటారు. ఆ సమస్య ఏంటి, ఈ ఫ్రెండ్స్ దాని నుంచి ఎలా భయటపడ్డారు అనేది టీజర్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. జాతిరత్నాలు టైప్ కామెడీ పంచ్ లు టీజర్ లో నవ్వించాయి. మ్యాడ్ స్క్వేర్ పేరుకు తగినట్లే మ్యాడ్ కు డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాలో ఉంటుందని టీజర్ తో తెలుస్తోంది.