మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా

మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తే అది ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అనుకోవచ్చు. ఇటీవల డ్యూయల్ రోల్స్ చేయడం తగ్గించారు మెగాస్టార్. ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం కథా చర్చల్లో ఉంది. ఈ చిత్రంలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబో మూవీపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సమ్మర్ లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.