రేపు “తల్వార్” ఫస్ట్ వార్నింగ్ ఇవ్వబోతున్న యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్

యంగ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “తల్వార్”లో నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న “తల్వార్” సినిమా నుంచి రేపు ఫస్ట్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు. ఆ వార్నింగ్ ఏంటనేది రేపు తెలియనుంది.

“తల్వార్” తనకు మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని హీరో ఆకాష్ జగన్నాథ్ నమ్మకంతో ఉన్నారు.సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు.