పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా నుంచి సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో ఈ రోజు రిలీజైంది. ఈ పాటను ఫోక్ స్టైల్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. మంగ్లీ, రమ్య బెహర, రాహుల్ సిప్లిగంజ్, యామినీ గంటసాల పాడారు.
పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ పై ఈ పాటను చిత్రీకరించారు. కొల్లగొట్టినాదిరో పాటలో పవన్ కల్యాణ్ స్టెప్స్, నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఏఎం రత్నం, దయాకర్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న హరి హర వీరమల్లు చిత్రాన్ని జ్యోతి కృష్ణ రూపొందిస్తున్నారు. త్వరలో పాన్ ఇండియా రిలీజ్ కు ఈ సినిమా రెడీ అవుతోంది.