హరీష్ శంకర్.. తన సినిమాలతో కన్నా.. తన కామెంట్స్ తో.. ఎక్కువుగా వార్తల్లో ఉంటుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఎప్పటి నుంచో సెట్స్ పైనే ఉంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. ఇప్పటి వరకు కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. అయితే.. ఇప్పుడు హరీష్ శంకర్.. కొత్తగా యాక్టింగ్ మొదలుపెట్టాడని తెలిసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పటి నుంచో సెట్స్ పైనే ఉంది. ఎప్పుడు పవర్ స్టార్ డేట్స్ ఇస్తారో.. ఎప్పుడు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. హరీష్ శంకర్ ఇప్పుడు ఓ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసింది. ఏ సినిమాలో అంటే.. సుహాస్ హీరోగా నటిస్తోన్న ఓ భామ అయ్యో రామ అనే సినిమాలో. ఇందులో సుహాస్ కు జంటగా మాళవిక మనోజ్ నటిస్తోంది. ఈ విభిన్న ప్రేమకథా చిత్రంలో హరీష్ శంకర్ నటిస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అసలు అంతలా ఏముంది ఈ సినిమాలో అనేది ఆసక్తిగా మారింది.