రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ రాజా సాబ్. ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో..ఈ సినిమాలో అలా చూపిస్తున్నాడు మారుతి. రాజా సాబ్ గ్లింప్స్ వేరే లెవల్ అనేలా ఉండడంతో మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. తన ఇమేజ్ కు తగ్గట్టుగా ప్రస్తుతం భారీ యాక్షన్ అండ్ మాస్ మూవీస్ చేస్తున్నాడు ప్రభాస్. ఫ్యాన్స్ మాత్రం లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మేన్ గా చూడాలి అనుకుంటున్నారు. అలాంటి క్యారెక్టర్ తోనే మారుతి రాజాసాబ్ ను డిజైన్ చేయడం విశేషం.
ఈ క్రేజీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ చేయని.. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా చేస్తుండడం విశేషం. ఏప్రిల్ 10న ది రాజాసాబ్ రిలీజ్ అని ప్రకటించారు. అయితే. ఈ క్రేజీ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. సెప్టెంబర్ నెలాఖరున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే రాజాసాబ్ షూటింగ్ పూర్తి చేసి.. ఫౌజీ పై ఫుల్ గా కాన్ సన్ ట్రేషన్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో.. సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారట. డేట్ ఫైనల్ అవగానే.. అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది.