మోక్షజ్ఞ తొలి సినిమాకి ప్రశాంత్ వర్మను డైరెక్టర్ గా ఫిక్స్ చేసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నారు. ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇక సెట్స్ పైకి రావడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. ఆతర్వాత ఈ మూవీ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయ్యింది అంతే కానీ.. క్యాన్సిల్ కాలేదని బాలకృష్ణ చెప్పడంతో పుకార్లకు చెక్ పడింది. ఆతర్వాత ప్రశాంత్ వర్మ తన వర్క్ లో బిజీ అయ్యాడు కానీ.. ఈ క్రేజీ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ మధ్య డిఫరెన్సస్ వచ్చాయని.. అందుకనే ఈ మూవీ పట్టాలెక్కకుండానే ఆగిపోయిందని గుసగుసలు వినిపించాయి.
ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్ మూవీని సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నాడట. రిషబ్ శెట్టి డేట్స్ ఇచ్చిన వెంటనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్. మరో వైపు మోక్షజ్ఞతో చేయాలి అనుకున్న కథ పై కసరత్తు పూర్తి చేసి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసి పక్కనపెట్టాడట. ఇప్పుడు మోక్షజ్ఞ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి కాస్త టైమ్ పడుతుందని తెలిసింది. ఇలా ఈ భారీ చిత్రం ఆలస్యం అవుతుండడంతో క్యాన్సిల్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. బాలకృష్ణ మాత్రం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఇయర్ లో మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.