ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకున్న మార్కో మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు. ఆహాలో మార్కో సినిమా చూస్తున్న మూవీ లవర్స్ తమ ఫేవరేట్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తుంటే ఆహాలో టాప్ లో ట్రెండ్ అయ్యేలా కనిపిస్తోంది.
మార్కో చిత్రాన్ని దర్శకుడు హనీఫ్ అడేని రూపొందించారు. క్యూబ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. ఉన్ని ముకుందన్ తో పాటు సిద్ధిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించారు. థియేట్రికల్ రిలీజ్ లో మలయాళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు సాధించింది మార్కో. ఇప్పుడు ఆహాలో ఈ సినిమా ఓటీటీ సెన్సేషన్ కు రెడీ అయ్యింది.