ఇకపై తన సినిమాల్లో అశ్లీలత, బూతు లేకుండా చూసుకుంటానని ప్రకటించారు హీరో విశ్వక్ సేన్ తన రీసెంట్ మూవీ లైలాకు వచ్చిన విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ నోట్ రిలీజ్ చేశారు విశ్వక్ సేన్. తను చెడ్డ సినిమా చేస్తే విమర్శించే హక్కు అందరికీ ఉందని, క్లాస్, మాస్ ఏ సినిమా తరహా సినిమా చేసినా అందరికీ నచ్చేలా చూసుకుంటానని విశ్వక్ సేన్ తన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
ఇటీవల వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు చేశాడు విశ్వక్ సేన్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ, లైలా ఈ మూడు చిత్రాలు అపజయం పాలయ్యాయి. లైలా సినిమాలో లేడీ గెటప్ తో కనిపించినా ఓల్డ్ ఫార్మేట్ నెరేషన్ తో ఈ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఫంకీ మూవీలో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు