మెగాస్టార్ చిరంజీవి పెళ్లి రోజు ఈ రోజు. ఈ స్పెషల్ డే ను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సతీమణి సురేఖతో కలిసి విమానంలో దుబాయ్ వెళ్తూ ఆ ఫ్లైట్ లోనే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఫ్లైట్ లో చిరంజీవితో పాటు నాగార్జున, అమల దంపతులు ఉండటం విశేషం.
ఈ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు చిరంజీవి. భార్యగా సురేఖ తనకు సపోర్ట్ గా నిలబడిందని ఆయన ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి ఫ్లైట్ లో పెళ్లి రోజు జరుపుకోవడం మర్చిపోలేని సందర్భమని ఆయన తెలిపారు. దుబాయ్ వెళ్తున్న ఫ్లైట్ లో చిరంజీవి దంపతులు పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు మెగాస్టార్.