ఈ సెన్సేషనల్ మూవీ మిస్ చేసుకున్న మహేశ్

సెన్సేషనల్ సక్సెస్ తో టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది ఛావా సినిమా. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ దక్కించుకుంటోంది. నార్త్ అంతా ఈ సినిమాను థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి హిస్టారికల్ మూవీని సూపర్ స్టార్ మహేశ్ బాబు మిస్ చేసుకున్నాడే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమా స్క్రిప్ట్ ను మొదట మహేశ్ బాబుకు చెప్పాడని, మహేశ్ అవును కాదు చెప్పేందుకు చాలా టైమ్ తీసుకున్నాడని తెలుస్తోంది. మహేశ్ ఏదీ తేల్చకపోవడంతో విక్కీ కౌశల్ దగ్గరకు ప్రాజెక్ట్ వెళ్లిందని సమాచారం. ఇలా మహేశ్ బాబు ఓ మెమొరబుల్ ఫిల్మ్ మిస్ చేసుకున్నట్లయ్యింది. మహేశ్ ఈ సినిమా గెటప్ లో ఉన్న ఏఐ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో మహేశ్ పుష్ప మూవీని కూడా మిస్ చేసుకున్నాడు.