చరణ్ బాగా హర్ట్ అయ్యాడు

మెగా ఫ్యామిలీలో అన్ కాంట్రవర్శల్ పర్సన్ గా రామ్ చరణ్ కు పేరుంది. ఎప్పుడూ ఏ వివాదంలోనూ రామ్ చరణ్ పేరు వినిపించదు. ఈవెంట్స్ లో మాట్లాడేప్పుడు కూడా రామ్ చరణ్ టు ది పాయింట్ చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. అలాంటి చరణ్ ఇటీవల తన మేనమామ అల్లు అరవింద్ వ్యాఖ్యలతో బాగా హర్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయ్యిందనే అర్థం వచ్చేలా ఇటీవల అల్లు అరవింద్ కామెంట్స్ చేశారు.

మెగా ఫ్యాన్స్ ఫైర్ అవడంతో తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావంటూ క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్. అయినా చరణ్ శాంతించినట్లు కనిపించడం లేదు. ఆయన రీసెంట్ గా అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడమే చరణ్ బాగా హర్ట్ అయ్యారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జనసేనకు కాకుండా వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేసినప్పటి నుంచి అల్లు, చిరు కుటుంబాలకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఇప్పుడవి మరింత పెరిగినట్లు తెలుస్తోంది.