ఎన్టీఆర్ ముందున్న టార్గెట్ ఇదే

ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నట్టుగా ఎప్పుడో అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. మేకర్స్ ముందుగా 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలకు చాలా టైమ్ పడుతుంది కానీ ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 10 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ప్లాన్‌ను ఎలాంటి జాప్యం లేకుండా చేయగలరా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. తదుపరి ప్రశాంత్ నీల్ సినిమా పై పూర్తి ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఈ సినిమాతో తన కెరీర్‌లో మరో లెవెల్లో క్రేజ్ అందుకోవాలి అనుకుంటున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎలిమెంట్లతో కూడిన పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరిలో ప్రారంభమవుతున్న ఈ సినిమా అనుకున్న ప్రకారం షూటింగ్ చేస్తుందా టార్గెట్ రీచ్ అవుతుందా అనేది చూడాలి.