పటాస్ మూవీతో డైరెక్టర్ గా పరిచయమై తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక అప్పటి నుంచి వరుసగా సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ 300 కోట్ల వసూళ్లు సాధించే దిశగా దూసుకెళుతోంది. దీంతో అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి అని టాక్ వినిపిస్తోంది.
అయితే.. ఈ మూవీ కోసం అనిల్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మెగాస్టార్ సినిమాతో కూడా ఖచ్చితంగా హిట్ సాధిస్తాడని అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి తనకున్న డిమాండ్ మేరకు రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు అనిల్ రావిపూడి తన రెమ్యునరేషన్‌గా 25 కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. దీనికి చిత్ర నిర్మాత సాహు గారపాటి కూడా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఈ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.