“మాస్ జాతర” రిలీజ్ డేట్ అనౌన్స్ మెట్ ఆ రోజే

హీరో రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్.. ఇలా వరుసగా ఫ్లాప్స్ ఇచ్చి నిరాశపరిచాడు. ఈ ఏడాది రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మూవీ మాస్ జాతర. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైటిల్‌తో మాస్ ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించిన రవితేజ సినిమాతో హిట్ కొట్టాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా విభిన్నమైన మాస్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతోందని టాక్.

రవితేజ కెరీర్‌లో 75వ సినిమాగా రూపొందుతున్న సినిమా కావడంతో మాస్ జాతర పై అంచనాలు మరింతగా ఉన్నాయి. పైగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మధ్య విడుదలైన పోస్టర్‌లో రవితేజ మాస్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. రవితేజను ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలి అనుకుంటున్నారో అలాంటి పాత్రతోనే మాస్‌ జాతరను దర్శకుడు భాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 26న మాస్ జాతర గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టుగా నిర్మాత నాగవంశీ అనౌన్స్ చేశారు. మే 9న మాస్ జాతర రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. గ్లింప్స్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం.