రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ కర్ణ క్యారెక్టర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఈ మూవీ సీక్వెల్ గురించి అప్డేట్ ఇచ్చారు నిర్మాత అశ్వనీదత్. వచ్చే ఏడాదే కల్కి రిలీజ్ ఉంటుందని ఆయన రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అశ్వనీదత్ చేసిన ఈ అనౌన్స్ మెంట్ రెబల్ ఫ్యాన్స్ ను సంతోషపెడుతోంది.
కల్కి మొదటి చిత్రంతో పాటు సీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ కూడా కొంతవరకు చేశారు. మిగతా బ్యాలెన్స్ షూటింగ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ ముగించి మూవీని నెక్ట్ ఇయర్ రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. అమితాబ్, దీపిక, కమల్ హాసన్ లాంటి స్టార్స్ కల్కి మూవీలో కీ రోల్స్ చేశారు.