సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్. ఈ సినిమాలో పూర్వాజ్, జ్యోతి పూర్వజ్, విశాల్ రాజ్, గౌతమ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సూపర్ షీ సాహసాలు ఎలా ఉండబోతున్నాయో ఆడియెన్స్ “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీలో చూడబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ షూటింగ్ మూవీకి కీలకంగా ఉండనుంది.
“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ చిత్రాన్ని ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటిదాకా “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.