అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు – నాగార్జున ఎమోషనల్ వీడియో

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా హీరో నాగార్జున ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. 1975లో అన్నపూర్ణ స్టూడియోస్ ను హైదరాబాద్ లో నిర్మించారు ఏఎన్నార్. అప్పటికి నగరం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. కొండలు, గుట్టల్లో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం జరిగింది. అప్పటి పరిస్థితులను, ఏఎన్నారు ముందుచూపును నాగార్జున తన వీడియోలో షేర్ చేసుకున్నారు నాగార్జున

నాగార్జున మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతోమంది కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ కు అవకాశాలు ఇచ్చిందని అన్నారు. అలాగే ఈ స్టూడియోలోకి వస్తే తనకు అమ్మా నాన్నలను చూసినట్లు ఉంటుందని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ను ఇన్నేళ్లుగా నమ్మకస్తులైన స్టాఫ్ నడిపిస్తున్నారని నాగార్జున తెలిపారు. నాగార్జున చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.