క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ త్రినాథరావు

మజాకా సినిమా టీజర్ లాంఛ్ ఈ‌వెంట్ లో హీరోయిన్ అన్షును కించపరిచేలా మాట్లాడిన డైరెక్టర్ త్రినాథరావు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. తన మాటల వల్ల మహిళలు బాధపడ్డారు. నవ్వించాలనే ప్రయత్నంలో అలా మాట్లాడాను, ఏమైనా తప్పు తప్పే, మహిళలకు నా క్షమాపణలు చెబుతున్నా అని తన వీడియోలో పేర్కొన్నారు.

హీరోయిన్ అన్షు సన్నగా ఉందని, బాగా తిని తమ సినిమాకు కావాల్సినట్లు మారమని అడిగానంటూ అనుచితంగా మాట్లాడారు త్రినాథరావు నక్కిన. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు వుమెన్ కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.