ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు వెళ్లక్కర్లేదు

హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. ఆయన ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టే అవసరం లేదంటూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ప్రతి ఆదివారం వెళ్లి సంతకం పెట్టే క్రమంలో అక్కడ భద్రత పరమైన చిక్కులు ఏర్పడుతున్నాయని, అందుకే దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అల్లు అర్జున్ విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చంటూ ఈ తీర్పులో కోర్టు తెలిపింది.

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ముద్దాయిగా ఉన్నారు. ఆయన ఈ కేసు నిమిత్తం గత ఆదివారం చిక్కడపల్లి పీఎస్ కు వెళ్లి విచారణ ఎదుర్కొన్నారు. తాము వద్దని చెప్పినా సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందని పోలీసులు చెబుతున్నారు.