“గేమ్‌ ఛేంజర్‌” ప్రత్యేక షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు హైదరాబాద్ లో స్పెషల్ షోస్ వేయడంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెన్ ఫిట్ షోస్ రద్దు చేస్తున్నామంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అర్థరాత్రి షోస్ కు పర్మిషన్ ఇవ్వడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

అర్థరాత్రి దాటిన తర్వాత షోస్ వేయడంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించుకోవాలని హైకోర్టు సూచించింది. భారీ బడ్జెట్ సినిమాలు చేశామని ప్రేక్షకుల నుంచి ఎక్కువ డబ్బులు టికెట్ రేట్ల రూపంలో వసూలు చేయడం సరికాదని కోర్టు చెప్పింది. గేమ్ ఛేంజర్ స్పెషల్ షోస్ పై వేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంపు, బెన్ ఫిట్ షోస్ ఉండవని ప్రభుత్వం చెప్పింది.