“గేమ్ ఛేంజర్” రియల్ టాక్ ఏంటి..?

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అయితే.. శంకర్ ప్లాపుల్లో ఉండడంతో సినిమా పై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు అనేది వాస్తవం. దిల్ రాజు ఈ విషయాన్ని స్వయంగా ఓ ప్రెస్ మీట్ లో ఒప్పుకోవడం విశేషం. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలోగా నటించిన మూవీ ఇది. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో చరణ్‌ స్టామినా ఎంత అనేది తెలుస్తుంది. అందుచేత మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు గేమ్ ఛేంజర్ కోసం.

గేమ్ ఛేంజర్ ఈ రోజు థియేటర్లోకి వచ్చింది. అయితే.. ఈ మూవీ ఫస్టాఫ్ డిసెంట్ గా బాగుందనిపించిందట. శంకర్ మార్క్ కనిపించిందట. ఇక చరణ్ పర్ ఫార్మెన్స్ అయితే.. వావ్ అనిపించేలా ఉందట. ఇక సెకండాఫ్ అయితే.. ట్విస్టుల మీద ట్విస్టులతో చరణ్‌ డిఫరెంట్ గెటప్స్ అదిరింది అనే పీలింగ్ కలిగించిందట. అయితే.. అంచనాలు ఏమాత్రం లేకుండా వస్తే.. బాగుందనిపిస్తుందట కానీ.. ఏదో ఉంటుందని వస్తే మాత్రం ఇంతేనా అనిపించవచ్చు. బాగుంది.. మంచి సినిమా అనే టాక్ అయితే వచ్చింది. మరి.. ఈ టాక్ తో గేమ్ ఛేంజర్ ఎంత కలెక్ట్ చేస్తుంది..? ఫస్ట్ వీక్ లో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుంది అనేది చూడాలి.