ఏ జానర్ సినిమా అయినా, సందర్భమేదైనా తన పాటతో అందంగా వర్ణించగలరు గీత రచయిత కేకే(కృష్ణకాంత్). తన 12 ఏళ్ల ప్రయాణంలో లిరిసిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారాయన. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ డబ్బింగ్ మూవీస్ పాటలతోనూ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తున్నారు కేకే. గతేడాది పలు సూపర్ హిట్ చిత్రాలకు పాటలు రాశారు కేకే. గడిచిన ఏడాది అనుభవాలను, ఈ ఏడాది చేయబోతున్న సినిమాల వివరాలను ఆయన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
లిరిసిస్ట్ కేకే మాట్లాడుతూ – గతేడాది మంచి పాటలు రాసే అవకాశం నాకు దక్కింది. పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకోవాలనే నా లక్ష్యం నేరవేరింది. నేను సింగిల్ కార్డ్ రాసిన సినిమాలు పడి పడి లేచె మనసు, సీతారామం, సలార్, రాధే శ్యామ్ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల నేను రాసిన పాటల్లో హాయ్ నాన్న మూవీలోని అడిగా పాట బాగా సంతృప్తిని ఇచ్చింది. ఓం బీమ్ భుష్ లోని అణువణువు పాట బాగా వైరల్ అయ్యింది. అలాగే డబ్బింగ్ మూవీ ఏఆర్ఎం లోని అంబరాల వీధిలోని పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనక అయితే గనక సినిమాలో నా ఫేవరేట్టు నా పెళ్లామే పాట కూడా బాగా హిట్టయ్యింది. ఇలా నేను రాసిన పాటల్లో 90శాతం సక్సెస్ అవుతుండటం సంతోషంగా ఉంది. రజినీకాంత్ వేట్టయాన్, శివకార్తికేయన్ అమరన్ సినిమాలకు రాసిన పాటలకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం పాటలతో పాటు స్క్రిప్ట్ రైటర్ గా ప్రయత్నిస్తున్నాను. ప్రశాంత్ వర్మ పీవీసీయూలో అధీర అనే మూవీకి డైలాగ్స్ ఇస్తున్నాను. కొత్త ఏడాదిలో ప్రభాస్ హను రాఘవపూడి మూవీ , ది రాజా సాబ్, రామ్ పోతినేని సినిమా ఇట్లు మీ సాగర్ కి, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి వీడీ 12 తదితర చిత్రాలకు పాటలు రాస్తున్నాను. అన్నారు.