ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన “డ్రింకర్ సాయి” సినిమా కలెక్షన్స్ బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతున్నాయి. డే 1 నుంచి ఉన్న క్రేజ్ 12వ రోజుకు కూడా కొనసాగుతోంది. ఏపీ తెలంగాణలో ఈ సినిమా 12 రోజుల్లో 5.74 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ చిన్న చిత్రానికి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం సర్ ప్రైజ్ చేసే విషయమే.
డ్రింకర్ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత డిసెంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.