యష్ “టాక్సిక్” బర్త్ డే పీక్ వచ్చేసింది

కన్నడ స్టార్ యష్ నటిస్తున్న కొత్త సినిమా టాక్సిక్. ఈ రోజు యష్ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. టాక్సిక్ పీక్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక పబ్ లోకి యష్ అడుగుపెట్టి, అక్కడ బార్ గర్ల్స్ ను మీట్ అవుతున్న వీడియోను ఈ పీక్ లో రిలీజ్ చేశారు. యష్ లుక్ కొత్తగా ఉంది. స్టైలిష్ యాక్షన్ కథతో టాక్సిక్ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్సస్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 10న టాక్సిక్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ రెండు చిత్రాల తర్వాత యష్ నటిస్తున్న చిత్రంగా టాక్సిక్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.