తాతా టెన్షన్ పడకు, మనకు “గేమ్ ఛేంజర్” ఉంది..!

దిల్ రాజు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్. వరుసగా సక్సెస్ అందించాడు. కథను నమ్మి మంచి చిత్రాలను అందించాడు. కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు అందించాడు. దీంతో దిల్ రాజు అంటే.. ఒక బ్రాండ్ ఏర్పడింది. దిల్ రాజు నుంచి సినిమా వస్తుంది అంటే.. ఆ సినిమా బ్లాక్ బస్టరే అనే టాక్ ఉండేది. దిల్ రాజు ప్రొడక్షన్ కెరీర్ లోనే గేమ్ ఛేంజర్ సినిమా ఒక్కటే అనుకున్న టైమ్ కంటే చాలా లేట్ గా కంప్లీట్ అయ్యింది. దీంతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది.

ఈ సినిమా వల్ల దిల్ రాజు ఎంతో టెన్షన్ పడ్డాడట. ఆ టైమ్ లో దిల్ రాజు మనవడు.. తాత టెన్షన్ పడకు.. మనకు గేమ్ ఛేంజర్ ఉందని చెప్పాడట. మనవడు అలా చెప్పేసరికి దిల్ రాజులో ధైర్యం వచ్చిందట. ఇక అప్పటి నుంచి గేమ్ ఛేంజర్ పై మరింతగా ఫోకస్ పెట్టాడట. ప్రమోషన్స్ లో స్పీడు పెంచాడు. ఇప్పుడు అంతగా బజ్ లేని గేమ్ ఛేంజర్ పై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ విషయాన్ని దిల్ రాజే స్వయంగా తెలియచేశారు. ఈ సంక్రాంతికి జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంటే.. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కానుంది. ఈ రెండు దిల్ రాజు సినిమాలే. మరి.. ఈ రెండు సినిమాలతో సక్సెస్ సాధించి దిల్ రాజు మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.