“కుబేర” రిలీజ్ ఎప్పుడంటే?

నాగార్జున, ధనుష్‌ కలిసి నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ కుబేర. ఈ మూవీని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. కుబేర రిలీజ్ ఎప్పుడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కు సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. అయితే మూవీ రిలీజ్ పై ప్రకటన రాలేదు. దీపావళికి నవంబర్ లో కుబేర రావచ్చు అంటూ టాక్ వచ్చింది. ఆ తర్వాత నవంబర్ కాదు.. ఫిబ్రవరిలో రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపించింది.

శేఖర్ కమ్ముల తన స్టైల్ లో తీస్తున్న సినిమా ఇది. ఇందులో ఎవరూ ఊహించని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. తెలుగుతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తమిళ్‌లోనూ రూపొందిస్తున్నారు. అందుచేత ఆలస్యం అవుతుంది అంటూ కొందరు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ నాగ్, కోలీవుడ్ స్టార్ ధనుష్ కలిసి ఫస్ట్ టైమ్ నటిస్తుండడంతో పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే.. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉంటుందని టీమ్ గట్టి నమ్మకంతో చెబుతున్నారు. ఇప్పుడున్న టాక్ ప్రకారం మేలో లేదా జూన్ లో కుబేర రిలీజ్ చేస్తారు అని సమాచారం.