ఎన్టీఆర్, నీల్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో ఇద్దరు స్టార్స్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వార్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న వార్ 2 కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. మరి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలిసింది. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి రానుంది. అయితే.. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా సప్త సగరాలు దాటి కథానాయిక రుక్మిణి వసంత్ నటిస్తోంది. మరో కథానాయికగా రష్మికను ఎంపిక చేస్తారని టాక్ వినిపిస్తోంది.

ఈ భారీ, క్రేజీ మూవీ కోసం.. ఇద్దరు స్టార్స్ ను ఫైనల్ చేశారట. ఇంతకీ.. ఆ ఇద్దరు స్టార్స్ ఎవరంటే.. మలయాళ స్టార్స్ బీజు మీనన్, టోవినో థామస్. వీరిద్దరూ బెస్ట్ యాక్టర్స్. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తుండడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఈ క్రేజీ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇంత వరకు ఎన్టీఆర్ ను ఎవరూ చూపించని విధంగా.. ఇంకా చెప్పాలంటే చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారని తెలిసింది.