బాక్సాఫీస్ వద్ద “పుష్ప 2” హిస్టారిక్ రికార్డ్

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో రెండో స్థానంలో ఉన్న బాహుబలి 2 రికార్డ్ ను పుష్ప 2 అధిగమించింది. బాహుబలి 2 1810 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే, పుష్ప 2 కేవలం 32 రోజుల్లో 1831 కోట్ల రూపాయల కలెక్షన్స్ దక్కించుకుంది.

దీంతో బాహుబలి 2 పేరిట ఇన్నాళ్లూ కొనసాగిన రికార్డ్ ముగిసింది. ఈ రికార్డ్ ను మూవీ టీమ్ తో పాటు మూవీ లవర్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేస్తున్నారు. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆమిర్ ఖాన్ దంగల్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి 2 వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి.