హీరో విశాల్ ఆరోగ్యంపై రూమర్స్

హీరో విశాల్ రీసెంట్ గా కనిపించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బాగా సన్నబడిన విశాల్…మైక్ పట్టుకునేందుకు కూడా బలం లేని విశాల్ వణికే చేతులతో ఈ వీడియోలో కనిపించారు. దీంతో విశాల్ అనారోగ్యం బారిన పడ్డారంటూ వార్తలు ప్రసారమవుతున్నాయి. దీనిపై మరికొన్ని మీడియా సంస్థలు వివరణ ఇస్తూ విశాల్ కు వైరల్ ‌ఫీవర్ ఉందని, అందుకే సన్నబడి, చేతులు వణికాయని పేర్కొన్నాయి.

విశాల్ హీరోగా నటించిన నటించిన మదగజరాజా సినిమా 12 ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతికి రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేదిక మీదే విశాల్ అనారోగ్యంతో కనిపించారు. ఈ చిత్రాన్ని జెమిని ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో దర్శకుడు సుందర్ సి మదగజరాజా రూపొందించారు. ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్స్ గా నటించారు.