రెండు భాగాలుగా “వీడీ 12”

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న వీడీ 12 సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్పై థ్రిల్లర్ కథతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా శ్రీలంకలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వీడీ 12 ఉండబోతోంది. ఈ సినిమా మేకింగ్ క్వాలిటీ సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని నాగవంశీ చెబుతున్నారు. వంద కోట్ల రూపాయలకు పైగా సినిమా కోసం ఖర్చు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. వీడీ 12లో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే నాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది ఉగాదికి వీడీ 12 రిలీజ్ చేస్తారని సమాచారం.