డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 మూవీతో చరిత్ర సృష్టించాడు. అయితే సినిమాలు వదిలేస్తా అంటూ రీసెంట్ గా ఆయన షాక్ ఇచ్చాడు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇప్పటికిప్పుడు ఏదైనా వదిలేయాలి అనుకుంటే ఏది వదిలేస్తారని.. సుమ అడిగితే.. సినిమా అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు సుకుమార్. ఇలా చెబితే ఏదో సరదాగా అంటున్నాడు అనుకున్నారు కానీ.. పక్కనే ఉన్న చరణ్ సంవత్సరం నుంచి ఇదే చెబుతున్నాడని అసలు విషయం బయటపెట్టాడు.
సుకుమార్ ఇలా చెప్పినప్పటి నుంచి పుష్ప 2 షూటింగ్ లో బాగా టెన్షన్ పడ్డాడని.. ముఖ్యంగా తను తీయాలనుకున్నది తీయలేకపోవడం వలన ఇలా అనుకున్నాడా..? లేక బన్నీ, సుకుమార్ మధ్య షూటింగ్ టైమ్ లో విబేధాలు వచ్చాయని ఇండస్ట్రీలో వినిపించింది. అందువలనే సినిమాలు వదిలేయాలి అనుకున్నాడా..? అనే చర్చ జరుగుతోంది. సుకుమార్ చాలా సిన్సిటివ్. ఏదో విషయంలో బాగా హర్ట్ అయ్యాడు. అందుకనే అలా చేయాలి అనుకున్నాడు. అయితే.. పుష్ప 2 తర్వాత చరణ్ తో సినిమాని ఎప్పుడో ప్రకటించారు. అలాగే పుష్ప 2 ఎండింగ్ లో పుష్ప 3 కూడా అనౌన్స్ చేశారు. సో.. ఇప్పట్లో సుకుమార్ సినిమాలను వదిలేసే ఛాన్స్ లేదు కానీ.. ఆ ఆలోచన అయితే ఉంది. మరి.. కారణం ఏంటి అనేది సుకుమార్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.