బలగం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు.. ఎల్లమ్మ టైటిల్ తో తన కొత్త సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మొదట నాని హీరోగా అనుకున్నారు. అయితే నాని అడిగిన దాదాపు 25 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ ను నిర్మాత దిల్ రాజు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు.
నాని ప్లేస్ లోకి నితిన్ వచ్చాడు. ఇప్పుడు ఎల్లమ్మ కథలో కీ రోల్, టైటిల్ క్యారెక్టర్ చేయాల్సిన హీరోయిన్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకున్నారు దర్శకుడు వేణు. ఎల్లమ్మ సినిమాలో టైటిల్ రోల్ ఎల్లమ్మగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే సెట్స్ మీదకు సినిమాను తీసుకెళ్తారని తెలుస్తోంది.