పోలీసుల విచారణలో మౌనమే అల్లు అర్జున్ సమాధానం

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఈరోజు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారించారు. దాదాపు 50 ప్రశ్నలు అల్లు అర్జున్ ను పోలీసులు అడిగారు. ఈ ప్రశ్నలకు అల్లు అర్జున్ పెద్దగా సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. అన్నింటికీ సైలైంట్ గా ఉన్నట్లు సమాచారం. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ముందే తెలుసుకదా అని పోలీసులు అడగగా..అల్లు అర్జున్ సమాధానం చెప్పలేదు. సంధ్య థియేటర్ ఘటనపై సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నారు.

ఇక ఈ కేసులో A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం, మేనేజర్. A9, A10 సెక్యూరిటీ సిబ్బంది. సంధ్య థియేటర్ ఫ్లోర్ ఇన్‌చార్జ్‌. A12 నుంచి A17వరకు అల్లు అర్జున్‌ బౌన్సర్లు. A18గా మైత్రి మూవీమేకర్స్‌ను పోలీసులు చేర్చారు. ఇప్పటికే A11గా అల్లు అర్జున్‌ ఉన్నారు. ఈ తొక్కిసలాటకు ప్రధాన కారకుడు బౌన్సర్ ఆంటోనిగా పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.