డ్రింకర్ సాయి సినిమా ప్రమోషనల్ కంటెంట్ యూత్ ఫుల్ గా ఉన్నా, థియేటర్స్ లో సినిమా చూశాక తమ టీమ్ ను ఏ ఒక్కరూ తప్పుపట్టరని, ప్రతి ఒక్కరూ అభినందిస్తారని అంటున్నారు యువ హీరో ధర్మ. ఐశ్వర్య శర్మతో కలిసి ఆయన హీరోగా నటిస్తున్న డ్రింకర్ సాయి సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి రూపొందించారు. ఈ రోజు జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూలో డ్రింకర్ సాయి సినిమా విశేషాలు తెలిపారు హీరో ధర్మ.
హీరో ధర్మ మాట్లాడుతూ – చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఫ్యాషన్. అయితే ఇంట్లో వాళ్లు సినిమాల్లోకి వద్దనేవారు. నాన్న మీద ఆధారపడటం ఇష్టంలేక సొంతంగా వ్యాపారం చేశాను. లాభాలు వచ్చాక సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నా కొత్త మూవీ డ్రింకర్ సాయితో మీ ముందుకు వస్తున్నాను. నా గత సినిమా సింధూరంకు మంచి పేరొచ్చింది. ఇది రెండో మూవీ. వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ ఇది. డ్రింకర్ సాయి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్ గారు. నేను సాయి అనే క్యారెక్టర్ చేసేందుకు చాలా మంది డ్రింకర్స్ ను అబ్సర్వ్ చేశాను. ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్ గారికి చిరంజీవి గారు మిత్రులు. ఆయన పీఆర్ పీ పార్టీలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేశారు. అలా మా మూవీ కథ గురించి చిరంజీవి గారికి చెబితే బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలా మా మూవీకి మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ దక్కాయి. డ్రింకర్ సాయి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి లవ్ స్టోరీ, మెసేజ్ కూడా ఉంటుంది. మా సినిమా యూత్ ను ఎవ్వరినీ చెడగొట్టేలా ఉండదు. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుంటారు. సెకండాఫ్ నుంచి కథ మరో స్థాయికి వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి మీ హార్ట్ టచ్ చేస్తుంది. అన్నారు