పోలీసులకు అల్లు అర్జున్ ఏం చెబుతాడో ?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ఈ రోజు పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. ఆయన చిక్కడపల్లి పీఎస్ లో ఏసీపీ ఎదుట ఎంక్వైరీకి అటెండ్ అవుతారు. అల్లు అర్జున్ సహా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న 18 మందిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో అటు చిక్కడపల్లి పీఎస్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ దారిలో రాకపోకలు నిలిపివేశారు.

మరోవైపు జుబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఇంటికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. చిక్కడపల్లి పీఎస్ లో విచారణలో అల్లు అర్జున్ ఏం చెబుతాడు అనేది ఉత్కంఠగా మారింది. అతనితో పాటు మామ చంద్రశేఖర్ కూడా పీఎస్ కు వెళ్తున్నారు.