“డ్రింకర్ సాయి” ఫస్టాఫ్ యూత్ ను, సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది – నిర్మాత బసవరాజు లహరిధర్

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో “డ్రింకర్ సాయి” సినిమా హైలైట్స్ నిర్మాత బసవరాజు లహరిధర్ తెలిపారు.

నిర్మాత బసవరాజు లహరిధర్ మాట్లాడుతూ – మెగాస్టార్ చిరంజీవి గారు మా నాన్న శ్రీనివాస్ గారికి మిత్రులు. “డ్రింకర్ సాయి” సినిమా సన్నాహాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారికి కథ గురించి చెప్పాం. ఆయన కథ గురించి తెలుసుకుని ఓకే ప్రొసీడ్ అన్నారు. మా చిత్రంలోని సాంగ్స్ ను ఆయనకు చూపిస్తే బాగున్నాయంటూ అప్రిషియేట్ చేశారు. రిలీజ్ కు మంచి డేట్ దొరికిందనే భావిస్తున్నాం. ఈ 27న ఎక్కువ సినిమాలు రావడం లేదు. ఏపీలో డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చాం. నైజాంలో ఓన్ రిలీజ్ చేస్తున్నాం. థియేటర్స్ కూడా బాగానే లభిస్తున్నాయి. సినిమా ఫస్టాఫ్ లోనే యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండాఫ్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఇంప్రెస్ అయ్యేలా స్టోరీ ఉంటుంది. సినిమా ప్రొడక్షన్ పరంగా గ్రాండ్ గా ఉండాలనే ప్రయత్నించాం. శ్రీవసంత్ మ్యూజిక్ కు మంచి పేరొస్తోంది. పాటలు హిట్ అయ్యాయి. హేషబ్ వహాబ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో సాంగ్ పాడించాం. అందరు పెద్ద సింగర్స్ తోనే సాంగ్స్ పాడించాం. చంద్రబోస్ గారు సింగిల్ కార్డ్ రాశారు. మ్యూజిక్ మా మూవీకి మంచి ఆకర్షణ అవుతోంది. అన్నారు.