పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సంచలన చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 700 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ సక్సెస్ అందించిన చిత్రమిది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 ఉండడంతో డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు సలార్ 2 వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ క్రేజీ మూవీ గురించి ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఇంతకీ.. ప్రశాంత్ నీల్ ఏం చెప్పారు..?
సలార్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూశాం. బాహబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాల్లో చూపించని మాస్ ను ఇందులో చూపించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కు సలార్ తెగ నచ్చేసింది. దీంతో సలార్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది.? ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ మూవీ షూటింగ్ లో ఉన్నారు. సలార్ 2 గురించి రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తన మనసులో మాటలను బయటపెట్టారు. ఈ మధ్య సలార్ 2 స్క్రిప్ట్ పై వర్క్ చేశాననీ. తన కెరీర్ లో బెస్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటే సలార్ 2 అని చెబుతాను అని స్వయంగా ప్రశాంత్ నీల్ చెప్పారు. దీంతో సలార్ 2 పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా.. అంతకు మించి అనేలా సలార్ 2 ఉంటుందని చెప్పారు. ఈవిధంగా సలార్ 2 కి ప్రశాంత్ నీల్ ఇస్తున్న ఎలివేషన్ రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తుంది. సలార్ 2 శౌర్యాంగ పర్వం క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని రెబల్ ఫ్యాన్స్ కి మాస్ ఫీట్ పక్కా అన్నట్టు తెలుస్తుంది. మరి.. ఈ మూవీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.