“గేమ్ ఛేంజర్”పై సుకుమార్ ఫస్ట్ రివ్యూ

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తోన్న భారీ, క్రేజీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీకి శంకర్ డైరెక్టర్. తెలుగులో శంకర్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ఇది. దిల్ రాజు ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతికి జనవరి 10న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. అయితే.. గేమ్ ఛేంజర్ అంచనాలను సుకుమార్ పెంచేశారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో నిర్వహించారు. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో చేయడం. అందుకనే ఈ ఈవెంట్ కు అక్కడ అనూహ్య స్పందన వచ్చింది. ఈ ఈవెంట్ మధ్యలో స్పెషల్ బోనస్ గా దోప్ సాంగ్ రిలీజ్ చేయడం, అందులో రామ్ చరణ్ స్టెప్పులు క్రేజీగా ఉండటం హైప్ ని ఇంకాస్త పైకి తీసుకెళ్లాయి. ఇన్ని రోజులు గేమ్ ఛేంజర్ కు పెద్దగా హైప్ లేదనే టాక్ ఉండేది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో కావాల్సినంత హైప్ వచ్చింది. ఇక ఇండియాలో మెయిన్ సిటీల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే.. మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ గేమ్ ఛేంజర్ మూవీని చిరంజీవితో పాటు సుకుమార్ కలిసి చూశారట. ఇదే విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ చెప్పారు. ఇక మూవీ గురించి సుకుమార్ ఏం చెప్పారంటే.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ స్థాయిలో ఉందని, ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్ ఇస్తుందని, క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటనకు అవార్డు రావడం ఖాయమని తెగ ఊరించేసారు. సినిమాని పూర్తిగా చూసి ఉంటే తప్పా ఇంతా కాన్ఫిడెంట్ గా చెప్పరు కాబట్టి ఫ్యాన్స్ సంతోషం మాములుగా లేదు. ఈ విధంగా గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసారు జీనియస్ డైరెక్టర్ సుకుమార్. గేమ్ ఛేంజర్ గురించి సుకుమార్ ఓ రేంజ్ లో చెప్పడంతో ఇది పక్కా బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తోంది. మరి..గేమ్ ఛేంజర్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.