ప్రభాస్ బ్లాక్ బస్టర్ “సలార్” @ వన్ ఇయర్

వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్ని చేర్చింది “సలార్”. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ డంకీ సినిమాను మించిన వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ స్టార్ డమ్ స్టామినాకు నిదర్శనంగా నిలిచిన “సలార్” రిలీజ్ ఈరోజుకు ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా సలార్ ఫస్ట్ యానివర్సరీ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెబెల్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ సలార్ పోస్ట్ లకు బాగా రెస్పాండ్ అవుతున్నారు.

“సలార్” వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరడం విశేషం. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా 300 రోజులువ వరుసగా ట్రెండింగ్ లో కొనసాగి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం”సలార్” సీక్వెల్ “సలార్ 2, శౌర్యంగపర్వ” చిత్రీకరణ జరుపుకుంటోంది.